నీళ్లతో బియ్యం కడగకుండా అన్నం వండేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కర్నూలు, 21 జూలై (హి.స.) మన రోజు వారి భోజనంలో ఎక్కవగా అన్నం తీసుకోవడం అలవాటు. చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం మూడు పూటలా అన్నం తినడానికి ఇష్టపడతారు. కొందరు బిర్యానీ, పలావ్ ఇలా రకరకాలుగా అన్నంతో వెరైటీలు చేస్తుంటాం. మరికొందరు ప్లెయిన్ రైస్ చక
నీళ్లతో బియ్యం కడగకుండా అన్నం


కర్నూలు, 21 జూలై (హి.స.)

మన రోజు వారి భోజనంలో ఎక్కవగా అన్నం తీసుకోవడం అలవాటు. చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం మూడు పూటలా అన్నం తినడానికి ఇష్టపడతారు. కొందరు బిర్యానీ, పలావ్ ఇలా రకరకాలుగా అన్నంతో వెరైటీలు చేస్తుంటాం. మరికొందరు ప్లెయిన్ రైస్ చక్కగా కూరలతో కలిపి తీసుకుంటారు. బియ్యంతో ఏ వంటకాలు చేసినా బియ్యం వండడానికి ముందు కనీసం 2 నుంచి 3 సార్లు బాగా కడగటం మీరు చూసే ఉంటారు. సాధారణంగా అందరూ ఈ పద్ధతిని అనుసరిస్తారు. బియ్యం వండడానికి ముందు కడగడం అవసరమా? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? బియ్యం కడగకుండా వండితే ఏమి జరుగుతుందో? ఇక్కడ తెలుసుకుందాం..

బియ్యం వండే ముందు కడగడం అవసరమా?

మనం పండ్లు, కూరగాయలను కడిగి క్రిములు, ధూళిని తొలగించినట్లే, బియ్యాన్ని కూడా కడగాలి. ఎందుకంటే బియ్యం పొలం నుంచి మిల్లుకు వెళ్తుంది. అక్కడి నుంచి షాపులకి వెళ్ళే ప్రక్రియలో, బియ్యంపై ధూళి, దుమ్ము, ఇసుక పేరుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే బియ్యం కడగడం చాలా ముఖ్యం. 2021లో జర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం , బియ్యం ప్యాకేజింగ్ సమయంలో మైక్రోప్లాస్టిక్‌లు బియ్యంతో కలిసిపోతాయి. అందుకే వండడానికి ముందు బియ్యాన్ని బాగా కడగడం అవసరం. ఇలా చేయడం వల్ల బియ్యం నుండి 20 నుండి 40% మైక్రోప్లాస్టిక్ కంటెంట్‌ను తొలగించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది.

విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది

బియ్యాన్ని బాగా కడగడం వల్ల దానిలోని ఆర్సెనిక్ సాంద్రత తగ్గుతుంది. ఆర్సెనిక్ సహజంగా నేల, నీటిలో కనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందువల్ల బియ్యాన్ని బాగా కడగడం వల్ల దానిలో కనిపించే విషపూరిత అంశాలను

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande