కాకినాడ, 21 జూలై (హి.స.)పీ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి ఎంపికయ్యారు. కాకినాడలోని ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో ఆదివారం ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా సుగుణ(తూర్పు గోదావరి), ప్రధాన కార్యదర్శిగా గుణ్ణం కృష్ణమోహన్(పశ్చిమ గోదావరి), కోశాధికారిగా ఆకుల చంద్రకళావతి(కడప), ఉపాధ్యక్షురాలిగా కె.సూర్యలక్ష్మీదేవి(గుంటూరు), సహాయ కార్యదర్శిగా జి.నవీన్ (ప్రకాశం), కార్యవర్గ సభ్యులుగా ఎన్.రాధిక(కర్నూలు), డి.అశోక్‌బాబు(గుంటూరు) ఎన్నికయ్యారు. పరిశీలకులుగా శాప్ నుంచి అశోక్ దుదారె, కాకినాడ డీఎస్ఏ నుంచి వి. సతీష్‌కుమార్ విచ్చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైన డాక్టర్ ఎన్.సుగుణను, నూతన కార్యవర్గాన్ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.శేషారెడ్డి అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ