ప్రజలు చీదరించుకుంటున్నారు.. రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలి! మండలి చైర్మన్
తెలంగాణ, నల్గొండ. 21 జూలై (హి.స.) ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు
మండల్ చైర్మన్


తెలంగాణ, నల్గొండ. 21 జూలై (హి.స.)

ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మాట్లాడే భాష మార్చుకోవాలని, మాటల ద్వారా గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో వారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉచిత పథకాలు, అవినీతి, బనకచర్ల ప్రాజెక్టు, సాగర్ ఎడమ కాలువ లాంటి తదితర విషయాలపై స్పందించారు. 'ఉచిత పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande