కడప, 21 జూలై (హి.స.)
, : రాష్ట్రంలో సంచలనం కలిగించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం ఘటన జరిగి సరిగ్గా నేటితో (జులై 21) ఏడాది. ఈ కేసులో ఆశించినంతగా పురోగతిలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలాది దస్త్రాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి కేసు దర్యాప్తునకు సమయం పడుతోందని దర్యాప్తు సంస్థ సీబీసీఐడీ వాదన. సమగ్ర దర్యాప్తుతో వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని విచారణాధికారి చెబుతున్నారు. 2024 జులై 21న రాత్రి 11.30 గంటలకు ఘటన జరగ్గా.. ఆ మరుసటి రోజే మదనపల్లెకు అప్పటి డీఐజీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్ అని విచారణ సందర్భంగా అప్పట్లో డీఐజీ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ