ఇంకొన్నేళ్లు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా.. ఖర్గేకు CM రేవంత్ బర్త్ డే విషెస్
హైదరాబాద్, 21 జూలై (హి.స.) ఆలిండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్, రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ''X'' (ట్విట్టర్) వేదికగ
CM రేవంత్


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్, రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే జన్మదినం సందర్భంగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ఖర్గే కలకాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంకొన్నేళ్లు సంవత్సరాలు దేశానికి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ కూడా మల్లికార్జున ఖర్గేకు బర్త్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..! భారత ప్రజల పట్ల మీ నాయకత్వం, నిబద్దత, అంకితభావం ఎల్లప్పుడూ మా అందరికీ స్ఫూర్తినిస్తాయి. మీరు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ రాహుల్ గాంధీ 'X' వేదికగా ట్వీట్ చేశారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande