తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 21 జూలై (హి.స.)
గత బీఆర్ఎస్ పాలనలో కొత్త
రేషన్ కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగినా పట్టించుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన శ్రీధర్ బాబు తెలంగాణ ఏర్పడ్డాక రెండు సార్లు ప్రజలు బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే ప్రజలకు ఏ మేలు చేయలదేని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులు, పేదలకు ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం విఫలం అయిందన్నారు. అవకాశం ఇస్తే మార్పు తెచ్చి చూపిస్తామని హామీ ఇచ్చామని తాము అధికారంలోకి రాగాయే మార్పు మొదలు పెట్టిందన్నారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు