తెలంగాణ,భూపాలపల్లి. 21 జూలై (హి.స.)
రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం పై ప్రజల దీవెనలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని నూతన మండలం గోరి కొత్తపల్లి మండలంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు తో కలిసి పర్యటించారు. కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో మంత్రి పొంగులేటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..
నూతన మండలానికి రావడంతో వర్షం పడటం శుభసూచకమన్నారు. స్థానిక ఎమ్మెల్యేను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినట్లే రానున్న ఎన్నికల్లో కూడా ఆశీర్వదించాలన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వానికి మీ దీవెలు ఉండాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజక వర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నారని ప్రతి పనిలో వారికి మంత్రులము పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు