మాట్లాడేందుకు చాన్స్ ఇస్త‌లేరు – విప‌క్ష నేత‌ రాహుల్..
న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.) లోక్ స‌భ‌లో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తనకు సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కే
రాహుల్ గాంధీ


న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)

లోక్ స‌భ‌లో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న తనకు సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార పక్షం సభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి.. తనకు మాత్రం అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సోమ‌వారం లోక్ స‌భ స‌మావేశాల ప్రారంభ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా లోక్ స‌భ‌లో మాట్లాడే హక్కు తనకు ఉన్నప్పటికీ.. వారు ఈవిధంగా చేయడం ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స‌భ‌లో చర్చలు మొదలవగానే ప్రధాని మోదీ అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విషయాల్లో తమకు అనుకూలంగా ఉండే కొత్త విధానాలను సృష్టించుకుంటోందని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande