ప‌వ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఇంటెలిజెన్స్ వైఫ‌ల్య‌మే.. రాజ్య‌స‌భ‌లో ఖ‌ర్గే
న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.) భారత్-పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై నేడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ.. ఖర్గే ఆందోళన
ఖ‌ర్గే


న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)

భారత్-పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై నేడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ.. ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగి నెలలు గడిచినా, ఆ ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేదు, వారి గురించి సమాచారం కూడా లేదన్నారు. నేడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు. అన్ని పార్టీలు దేశాన్ని బలోపేతం చేయడానికి, సైన్యానికి ధైర్యం నింపడానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ, ఇప్పుడు అసలు పెహల్గామ్ దాడి జరిగిన దాని గురించి స్పష్టమైన సమాచారం కావాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ విషయంలో లోపం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. ఆ క్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి ప్రభుత్వం ప్రపంచానికి, భారత ప్రజలకు చెప్పింది. కానీ, ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగిందో సమాచారం ఇవ్వాలని ఖర్గే కోరారు..

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande