తెలంగాణ, కామారెడ్డి. 21 జూలై (హి.స.)
బాన్సువాడ పట్టణంలో సోమవారం ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్సువాడ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్దకు రాగానే డ్రైవర్ కళ్ళు తిరిగి సైడ్ బానేట్ పై పడ్డాడు. దీంతో బస్సు అదపు తప్పి రోడ్డు పై బీభత్సం సృష్టించింది. తమ మీదకు దూసుకు వస్తున్న బస్సును చూసి రోడ్డు పై జనం పరుగులు తీశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి, వెంటనే బస్సు గేర్ ను న్యూట్రల్ చేసి బ్రేక్ కొట్టి బస్సును ఆపాడు. ఈలోగా 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదాన్ని తప్పించిన కండక్టర్ ను
పలువురు అభినందించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు