రేవంత్ పాల‌న‌లో సీన్ రివ‌ర్స్ … భూముల ధ‌ర‌లూ డ‌మాల్ – హ‌రీశ్ రావు
తెలంగాణ, సిద్దిపేట.21 జూలై (హి.స.) ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేదని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏపీలో ఎకరా అమ్మితే ఇప్పుడు తెలంగాణలో రెం
హ‌రీశ్ రావు


తెలంగాణ, సిద్దిపేట.21 జూలై (హి.స.)

ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేదని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏపీలో ఎకరా అమ్మితే ఇప్పుడు తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక మన దగ్గర ఇలాంటి పరిస్థితి వచ్చిందనిమండిపడ్డారు. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ పార్టీ పగపట్టిందని హరీష్ రావు పేరొన్నారు.

ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో సోమవారం హరీష్ రావు మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వీయ అనుభవం చెందారు. రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కానీ 2 లక్షల పెన్షన్లు తీసేశారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande