నిజామాబాద్., 21 జూలై (హి.స.)
యువత చెడు వ్యసనాలను వదిలి
ఉన్నత స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని స్వేరోస్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ స్వేరోస్ బూట్ క్యాంప్ శిక్షణ తరగతులు సోమవారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి స్వేరోస్ చైర్మన్ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచం కృత్రిమ మేధస్సు(AI) వైపు వేగంగా దూసుకెళ్తున్న ఈ కాలంలో మనము అదే దిశగా నడవాలి అన్నారు. కేవలం అక్షరం మాత్రమే కాదు ఆరోగ్యం ఆర్థిక స్వాలంబన కూడా ఎంతో అవసరం అని అన్నారు.
ఈ శిక్షణలో పరిరక్షణపై చిట్కాలు, ఆత్మహత్య నివారణ, దైనందిన ఒత్తిడి నుండి బయటపడే మార్గాలు, అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం వంటి మౌలిక విలువలపై అవగాహన తదితర ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్