సూర్యాపేట, 21 జూలై (హి.స.)
సూర్యాపేట పట్టణంలోని ఓ జ్యువెలరీ షాపులో ఆదివారం రాత్రి భారీ బంగారం చోరీ జరిగింది. దుకాణదారుడు కిషోర్ ఎప్పటిలాగే ఆదివారం రాత్రి షాపును మూసివేసి వెళ్లిపోయారు.. సోమవారం ఉదయం యధావిధిగా షాపు తెరిచినప్పుడు షట్టర్ పగిలి పోయి ఉండటంతో వెంటనే దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా దర్యాప్తు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ, షాపు వెనుక భాగంలో ఉన్న బాలాజీ గ్రాండ్ ఎదురుగా గల రెండు బాత్రూమ్ల గోడలలో రంధ్రం చేసి, గ్యాస్ కట్టర్లతో షట్టర్లను కట్ చేసి దొంగలు లోపలికి ప్రవేశించారని తెలిపారు.
దొంగల ముఠాను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించినట్టు తెలిపారు. బాధితుల అంచనా ప్రకారం దాదాపు 15 నుండి 18 కిలోల బంగారం చోరీకి గురైనట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్