నిజమైన బీసీ పక్షపాతి ఎవరో ప్రజలకు ఇప్పుడు తెలుస్తది.. వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, 21 జూలై (హి.స.) కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు అమోదించాలని అన్నా
వీహెచ్


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లు అమోదించాలని అన్నారు. 50 శాతం సీలింగ్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇద్దరు బీసీలు కొట్టుకుంటే... ఓసీకి కట్టబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. బీసీలపై అంత వివక్ష చూపిస్తున్న ప్రధాని మోడీ.. బీసీ బిల్లును ఆమోదిస్తారా? అని అనుమానం వ్యక్తం చేశారు. నిజమైన బీసీ పక్షపాతి ఎవరో ప్రజలకు ఇప్పుడు తెలుస్తుందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande