హైదరాబాద్, 21 జూలై (హి.స.) ఒడిశాలోని భువనేశ్వర్లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఈయూఐ అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హోటల్ గదిలో ప్రధాన్ తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదిత్ ప్రధానన్ను అరెస్ట్ పోలీసులు చేసి దర్యాప్తు చేశారు. ఇక, లైంగిక దాడి కేసు నేపథ్యంలో నిందితుడు ఉదిత్ ప్రధానన్ను ఎన్ఎస్ఈయూఐ సస్పెండ్ చేసింది. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో నిందితుడు గతంలో దిగిన ఫోటోను తెలంగాణ బీజేపీ షేర్ చేసింది. 'ఒడిశాలో 19 ఏళ్ల యువతిని రేప్ చేసిన కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు.. ఇదేనా ఆడబిడ్డల భద్రత పట్ల కాంగ్రెస్ నిబద్ధత? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ఈ అంశంపై స్పందిస్తారా? స్పందించరా? ఆడబిడ్డల భద్రత అనేది కేవలం ఒక నినాదం కాదు.. మహిళల హక్కు' అని తెలంగాణ బీజేపీ ట్వీట్లో ఫైర్ అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..