గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి సీఎం రేవంత్ రెడ్డి విషెస్
హైదరాబాద్, 21 జూలై (హి.స.) జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్లో భారత మహిళా గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి సెమీ ఫైనల్కు చేరుకుంది. వరల్డ్ కప్లో సెమీస్లో అడుగుపెట్టిన తొలి ఇండియన్గా ఘనత సాధించింది. ఈ మేరకు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిపై భారత్లోని
కోనేరు హంపి


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్లో భారత మహిళా గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి సెమీ ఫైనల్కు చేరుకుంది. వరల్డ్ కప్లో సెమీస్లో అడుగుపెట్టిన తొలి ఇండియన్గా ఘనత సాధించింది. ఈ మేరకు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిపై భారత్లోని ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు. ఈ లీగ్ లో చేరిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆమె విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను' అని విషెస్ తెలిపారు. కాగా, ఫిడే మహిళల వరల్డ్ కప్లో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోనేరు హంపీ 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్పై విజయం సాధించింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande