అమరావతి, 21 జూలై (హి.స.)
పామర్రులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఇంకా ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అని చెప్పడం కాదు.. రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ