ముంబయి:, 21 జూలై (హి.స.)బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే నిన్నటి ధరలతో పోల్చితే వీటి రేట్లు ఈరోజు (జూలై 21న) స్వల్పంగా తగ్గుముఖం (gold rates today on july 21st 2025) పట్టాయి. ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 00, 030కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91, 690గా ఉంది.
ఇది నిన్నటి రేటుతో పోల్చుకుంటే స్వల్పంగా రూ.10 మాత్రమే తగ్గింది. ఈ రోజు ధరల తగ్గుదల స్వల్పమైనదే అయినప్పటికీ, పెద్ద మొత్తంలో పసిడి కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. మరోవైపు సామాన్యులు మాత్రం లక్షకు చేరుకున్న పసిడి ధరలను చూసి కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.
చెన్నైలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
ముంబైలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
ఢిల్లీలో 24 క్యారెట్ రూ. 1,00,180, 22 క్యారెట్ రూ. 91,840
కోల్‌కతాలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ