29న తిరుమలలో గరుడ పంచమి
తిరుమ‌ల‌, 21 జూలై (హి.స.) తిరుమ‌ల‌లో జులై 29న మంగళవారం గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఆ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి
తిరుమల


తిరుమ‌ల‌, 21 జూలై (హి.స.)

తిరుమ‌ల‌లో జులై 29న మంగళవారం గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది.

ఆ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు. ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు.

ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande