దిల్లీ: 21 జూలై (హి.స.)పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర, ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ గురించి ప్రధాని ప్రస్తావించారు.
‘‘ఆపరేషన్ సిందూర్‌లో మన దేశ సైనికుల సత్తా చూశాం. అందులో వందశాతం లక్ష్యాలను సాధించాం. కచ్చితమైన లక్ష్యంతో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఈ ఆపరేషన్‌తో మేడిన్ ఇండియా సైనిక సామర్థ్యం, గొప్పతనం ఏంటో ప్రపంచం చూసింది. ఈ మధ్య కాలంలో నేను ఎవరిని కలిసినా మేడిన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతున్నారు. మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది దేశ ప్రగతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయమిది. ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’’ అని మోదీ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ