లంక గ్రామాల ప్రజలకు రెడ్ అలర్ట్
అమరావతి, 21 జూలై (హి.స.)లంక గ్రామాల ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీలో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం ఉదయం 6 గంటలకు బ్యారేజి గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేయన
లంక గ్రామాల ప్రజలకు రెడ్ అలర్ట్


అమరావతి, 21 జూలై (హి.స.)లంక గ్రామాల ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీలో పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని సోమవారం ఉదయం 6 గంటలకు బ్యారేజి గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. నదిలో ప్రయాణాలు చేయవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం వంటివి చేయకూడదని విజ్ఞప్తి చేశారు అధికారులు. కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాన బీభత్సం సృష్టించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande