ముంబయి 21 జూలై (హి.స.)అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. నేటి ఉదయం 9.17 సమయంలో సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 81,764, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 24,962 వద్ద ట్రేడవుతున్నాయి. హాట్సన్ ఆగ్రో, నవీన్ ఫ్లోరిన్, షేర్ ఇండియా సెక్యూరిటీస్, అలెంబిక్ ఫార్మా, ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ లాభాల్లో ఉండగా.. సీబీఎస్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ, సీక్వెంట్ సైంటిఫిక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫినాన్స్ నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో ప్రధాన సూచీలైన చైనాకు చెందిన షెన్‌జెన్, షాంఘై, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ, న్యూజిలాండ్ సూచీ ఎన్‌జెడ్‌ఎక్స్ 50 లాభాల్లో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్ 200, తైవాన్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.32 వద్ద ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ