కడప.కేంద్ర కారాగారంలో.ఐదుగురు జైలు.సిబ్బంది పై.సస్పెన్షన్ వేటు
అమరావతి, 22 జూలై (హి.స.) : కడప కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఐజీ రవికిరణ్ నివేదిక మేరకు జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మరో ముగ్గురు జైలు వార్డర్లను సస
కడప.కేంద్ర కారాగారంలో.ఐదుగురు జైలు.సిబ్బంది పై.సస్పెన్షన్ వేటు


అమరావతి, 22 జూలై (హి.స.)

: కడప కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. డీఐజీ రవికిరణ్ నివేదిక మేరకు జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మరో ముగ్గురు జైలు వార్డర్లను సస్పెండ్‌ చేశారు. ఈ అంశంలో మరికొందరు పైన కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కడప కేంద్ర కారాగారంలో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై కడప జైల్లో డిఐజీ రవికిరణ్ నాలుగు రోజుల పాటు విచారణ చేపట్టారు. విచారణలో ఆరోపణలు నిజమే అని తేలాయి. డీఐజీ ప్రాథమిక నివేదిక ఆధారంగా.. ఐదుగురిపై జైళ్ల శాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande