కేంద్ర నిర్ల‌క్ష్య‌మే పహల్గామ్‌లో ఉగ్ర‌దాడికి కార‌ణం – సీపీఐ నారాయ‌ణ‌
హైదరాబాద్, 22 జూలై (హి.స.) జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడికి కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. మంగళవారం ప‌హ‌ల్గామ్ లో నారాయ‌ణ పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఇక్క
సీపీఐ  నారాయ‌ణ‌


హైదరాబాద్, 22 జూలై (హి.స.)

జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడికి కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యమే కార‌ణ‌మ‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. మంగళవారం ప‌హ‌ల్గామ్ లో నారాయ‌ణ పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఇక్కడ ప్రతి రెండు వందల గజాలకు ఒక ఆర్మీ క్యాంపు ఉందని చెప్పారు. ఇలాంటి చోట ఉగ్ర‌వాదులు విచ్చల విడిగా కాల్పులకు తెగ బడ్డారు అంటే కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మ‌ని అన్నారు.

ఆపరేషన్ సిందూర్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాయని నారాయ‌ణ అన్నారు. ఈ అనుమానాలు నివృత్తి కావాల్సి ఉందన్నారు. ఈ మేరకు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande