హైదరాబాద్, 23 జూలై (హి.స.)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2025 ఆగస్టు 16 న ప్రారంభమయ్యే “ పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర ” భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పర్యటనను ఐఆర్ సీటిసీ ప్రకటించింది. ఈ రైలు ఉజ్జయినిలోని మ హాకాళేశ్వర్ జ్యోతిర్లింగ & ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలను; దీక్షా భూమి స్థూపం (డా. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం ) & నాగ్‌పూర్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరం; మోవ్ వద్ద జన్మ భూమి (డా. అంబేద్కర్ జన్మస్థలం) ; నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం; పూణేలో భీమశంకర్ జ్యోతిర్లింగం మరియు ఔరంగాబాద్ వద్ద గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మొదలైన ప్రదేశాలను సందర్శించే అవకాశాన్నికల్పిస్తుంది.
సికింద్రాబాద్‌తో పాటు కామారెడ్డి , నిజామాబాద్, ధర్మాబాద్ , ముద్ఖేడ్ , నాందేడ్ & పూర్ణ వంటి ముఖ్యమైన మార్గ మధ్యంలో స్టేషన్లలో ఇరువైపులా ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు /దిగేందుకు సౌకర్యం కల్పించబడింది. మొత్తం ట్రిప్ 08 రాత్రులు / 09 రోజుల వ్యవధిలో కవర్ చేయబడుతుంది. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్ మరియు డిన్నర్ - ఆన్-బోర్డు మరియు ఆఫ్-బోర్డ్ రెండూ), ప్రయాణం అంతటా వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌ల సేవలు, రైలులో భద్రత (సిసిటీవి కెమెరాలు అన్ని కోచ్‌లలో అమర్చబడ్డాయి) పబ్లిక్ అనౌన్స్మెంట్ సౌకర్యం మరియు ప్రయాణ భీమా సౌకర్యాలు కల్పించబడ్డాయి.
పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర
ఉజ్జయిని మ హాకాలేశ్వర్ జ్యోతిర్లింగ & ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ
నాగ్‌పూర్ దీక్షా భూమి స్థూపం (డా. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం ) & శ్రీ స్వామినారాయణ మందిరం
మోవ్ జన్మ భూమి (డా. అంబేద్కర్ జన్మస్థలం)
నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం
పూణే భీమశంకర్ జ్యోతిర్లింగం
ఔరంగాబాద్ గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం
పర్యటన తేదీలు 16.08.2025 నుండి 24.08.2025 వరకు (08 రాత్రులు / 09 పగళ్ళు)
బోర్డింగ్ & డీ-బోర్డింగ్ స్టేషన్లు సికింద్రాబాద్, కామారెడ్డి , నిజామాబాద్, ధర్మాబాద్ , ముద్ఖేడ్ , నాందేడ్ & పూర్ణ
టూర్ ధర (ఒక్కొక్కరికి)
సేవలు ఎకానమీ కేటగిరీ ప్రామాణిక వర్గం కంఫర్ట్ కేటగిరీ
రైలు ప్రయాణ తరగతి స్లీపర్ 3ఎసి 2ఎసి
డబుల్/ట్రిపుల్ షేర్ రూ. 14,700/- రూ. 22,900/- రూ. 29,900/-
పిల్లలకు (5-11 సంవత్సరాలు) రూ. 13,700/- రూ. 21,700/- రూ. 28,400/-
ప్రయాణ ప్రణాళిక ప్రకారం బడ్జెట్ హోటళ్లలో రాత్రి బస నాన్-ఏసి రూమ్ ఏసీ రూమ్ ఏసీ రూమ్
రవాణా ఏసీ లేని వాహనం ఏసీ లేని వాహనం ఏసీ వాహనం
ఈ యాత్ర కోసం
బుకింగ్ కోసం : సంప్రదించండి - 9701360701, 9281030712, 9281030711 సంప్రదించవచ్చు
ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం ఐఆర్ సీటిసీ వెబ్‌సైట్:: www.irctctourism.com ను సందర్శించవచ్చు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు