ఎన్టీఆర్ జిల్లా, 23 జూలై (హి.స.)
:తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్‌నీ పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు )ఆరోపణలు చేశారు. తిరువూరు స్టేషన్‌లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఎస్ఐ సత్యనారాయణ ఒక వ్యక్తినీ గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్‌కి పిలిపించారని.. మరో వ్యక్తి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐకి బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర డబ్బులు ఎస్ఐ సత్యనారాయణకి ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ