అమరావతి, 23 జూలై (హి.స.)
బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాత మాగులూరు శివారులో తండ్రీ కొడుకు దారుణ హత్యకు గురైన ఘటనలో ప్రధాని నిందితుడు గడ్డం అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నిందితుడు గడ్డం అనిల్ కుమార్ రెడ్డిని విచారిస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో విబేధాల కారణంగానే వీరిద్దరిని ప్రత్యర్థులు హత్య చేశారని పోలీసులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ