రైతుల ముంగిట్లోకి భూసార పరీక్షలు. : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్., 23 జూలై (హి.స.) భూసార పరీక్ష రైతన్నకు రక్ష అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండలం కూచన్పల్లి రైతు వేదికలో లారస్ ల్యాబ్ చారిటబుల్ ట్రస్ట్, ఇక్రిసాట్ సంయుక్తంగా కలిసి రైతులు వ్యవసాయ సంక్షేమం కోసం అవగాహన కల్ప
కలెక్టర్ రాహుల్ రాజ్


మెదక్., 23 జూలై (హి.స.)

భూసార పరీక్ష రైతన్నకు రక్ష అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండలం కూచన్పల్లి రైతు వేదికలో లారస్ ల్యాబ్ చారిటబుల్ ట్రస్ట్, ఇక్రిసాట్ సంయుక్తంగా కలిసి రైతులు వ్యవసాయ సంక్షేమం కోసం అవగాహన కల్పించడం ස0යි.

భూసార పరీక్ష వాహనం ద్వారా రైతుల ముంగిట్లోకి భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలను నేల ఆరోగ్య కార్డు రూపంలో అందించడం, పంటలకు సరైన మోతాదులో రసాయన ఎరువుల వినియోగం ద్వారా సమగ్ర పోషక యాజమాన్యం పాటించి పెట్టుబడి ఖర్చు తగ్గించడం తద్వారా అధిక దిగుబడులు సాధించుకుంటూ నేల సంరక్షణ దోహదం చేయడం పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసార పరీక్ష రైతన్నకు రక్ష అని అన్నారు. ఈ వాహనం ద్వారా రైతు పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలకు ఉచితంగా మట్టి పరీక్షలు నిర్వహించి రైతులకు నేల ఆరోగ్య కార్డును అందజేయడం జరుగుతుందన్నారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా, మీ పొలానికి ఏ రకాల ఎరువులు అవసరమో తెలుసుకోవచ్చు. తదనుగుణంగా పంటలను సాగు చేసుకోవచ్చునని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande