అమరావతి, 22 జూలై (హి.స.)ఇటీవల బదిలీ అయిన, పదోన్నతులు పొందిన టీచర్లకు జీతాల చెల్లింపులో ఏర్పడిన జాప్యాన్ని నివారించాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కొత్త పొజిషన్ ఐడీలు రాకపోవడంతో వారికి జీతాలు నిలిచిపోయాయని, ఆర్థిక శాఖ నుంచి జీవో విడుదల చేసి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, బదిలీలు, పదోన్నతుల వల్ల జీతాలు ఆగిపోయిన టీచర్లకు వెంటనే జీతాలు వచ్చేలా జీవో జారీచేయాలని ఏపీటీఎఫ్-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. కేబినెట్ ఆమోదం వరకు వేచి చూడకుండా తొలుత జీవో జారీచేసి, ఆ తర్వాత కేబినెట్‌లో రాటిఫై చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ