శానిటైజర్ స్పిరిట్ తో కల్తీ విస్కీ తయారీ.. ఏడుగురు అరెస్ట్..!
హైదరాబాద్, 22 జూలై (హి.స.) తెలంగాణలోని ఉప్పల్ కేంద్రంగా నడుస్తున్న ఒక ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్ను ఉపయోగించి నకిలీ విస్కీ, బ్రాంది తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలంగాణలో కల్తీ సరుకును తయ
కల్తీ విస్కీ


హైదరాబాద్, 22 జూలై (హి.స.)

తెలంగాణలోని ఉప్పల్ కేంద్రంగా

నడుస్తున్న ఒక ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్ను ఉపయోగించి నకిలీ విస్కీ, బ్రాంది తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలంగాణలో కల్తీ సరుకును తయారీ చేసి రెండు తెలుగు రాష్ట్రలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ ముఠా శానిటైజర్ తయారీ కోసం తీసుకున్న స్పిరిట్ను వినియోగించి మద్యం తయారీకి దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఫార్మా కంపెనీ యజమాని, నవ్య కెమికల్స్ యజమానులు ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు.

నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ లేబుల్స్, ఎంసి విస్కీ బ్రాండ్లకు చెందిన నకిలీ స్టిక్కర్లు ముద్రించి స్పిరిట్తో తయారు చేసిన మద్యం పై అంటించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ ముఠాపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో... ప్రత్యేకంగా సోదాలు నిర్వహించామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ఈ ముఠా దాదాపు 9 నెలలుగా నకిలీ మద్యం తయారీ కొనసాగిస్తూ మార్కెట్లో పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ వస్తోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande