హైదరాబాద్, 22 జూలై (హి.స.)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ రావు బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఇవాళ ఆయన గాంధీ భవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాంచందర్ రావు వ్యవహారం బీసీలకు వ్యతిరేకంగా ఉందని, బీసీ రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్నామని రాష్ట్రంలో చెబుతూనే.. ఢిల్లీకి వెళ్లగానే మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేబినెట్లో, ఆసెంబ్లీలో ఆమోదించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని అన్నారు. అదేవిధంగా 42 శాతం రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా కులగణన చేశామన్నారు.
బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. పక్కాగా లెక్కలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోమని చెప్పింది సుప్రీం కోర్టేనని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..