బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కుమ్ముడే.. ఆ జిల్లాలకు
అమరావతి, 22 జూలై (హి.స.) దక్షిణ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రం మట్టం నుంచి 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వరకు సగటు సముద్ర
బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కుమ్ముడే.. ఆ జిల్లాలకు


అమరావతి, 22 జూలై (హి.స.)

దక్షిణ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రం మట్టం నుంచి 5.8 కి మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిమీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. అల్లురి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అటు తెలంగాణకు భారీ వర్షసూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఈ రోజు(మంగళవారం) తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. మరో 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande