భారీ దొంగతనం నిందితులను పట్టుకున్న గద్వాల పోలీసులు..
తెలంగాణ, గద్వాల. 22 జూలై (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. జయలక్ష్మి ఏజన్సీ అనే సిగరెట్ డీలర్ షాప్లో జూలై 11వ తేదీ రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి సుమారు రూ.18 లక్షల విలువైన సిగరెట్ కాటన్ బాక్స్లు ఎత్
గద్వాల పోలీస్


తెలంగాణ, గద్వాల. 22 జూలై (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో

జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. జయలక్ష్మి ఏజన్సీ అనే సిగరెట్ డీలర్ షాప్లో జూలై 11వ తేదీ రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి సుమారు రూ.18 లక్షల విలువైన సిగరెట్ కాటన్ బాక్స్లు ఎత్తుకెళ్లారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ టాటా బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాయచూర్ పరిసరాల్లో నిందితులు రతన్ లాల్, జగదీష్ లను అరెస్ట్ చేసి, రూ.15 లక్షల విలువైన సిగరెట్ బాక్స్లు, KA22P-4306 అనే నెంబర్ గల మారుతి ఈకో వ్యాన్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బీర్బల్ పరారీలో ఉన్నట్టు జిల్లా ఎస్పీ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసు ఛేదనలో పోలీసుల పని తీరును జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు, IPS అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande