తెలంగాణ, కొత్తగూడెం. 22 జూలై (హి.స.)
ప్రతీ క్షణం కొత్తగూడెం ప్రాంతాభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన 'మహిళా శక్తి సంబురాలు' కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ప్రమాద బీమా, బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నట్లు, హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాజీపడబోనని తెలిపార. ప్రతీ మహిళకు సంక్షేమం, ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం అమలు చేసే పథకం అందేలాగా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు