హైదరాబాద్, 22 జూలై (హి.స.) హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎంపీ ఈటల రాజేందర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్తో పాటు హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కుట్రలు చేస్తూ మోసం ఆరోపించారు. రేపటి రోజు కూడా బీజేపీని కూడా ఎలా మోసం చేస్తాడో బయటపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తాను ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఈటలను ఆహ్వానించినా అహంకారంతో హాజరుకాక.. నేడు పిలువలేదని తనపై అభాండాలు వేయడం సరికాదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల సమయంలో శిలా ఫలాకాలపై నాడు ఎమ్మెల్యేగా ఉన్న ఈటల పేరు లేకపోతే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. లేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఏది పడితే అది.. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోబోమని, తాము ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చొలేదని కౌశిక్ రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..