జైల్లో మిషన్.రెడ్డి కి సదుపాయాలు. కల్పించాలన్న పిటిషన్ పై వాదనలు . ముగిసాయి
అమరావతి, 22 జూలై (హి.స.) జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాన్న పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ సాయంత్రం లోపు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని
జైల్లో మిషన్.రెడ్డి కి సదుపాయాలు. కల్పించాలన్న పిటిషన్ పై వాదనలు . ముగిసాయి


అమరావతి, 22 జూలై (హి.స.)

జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాన్న పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ సాయంత్రం లోపు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని జైళ్ల శాఖను కోర్టు ప్రశ్నించగా.. ఇస్తున్నామన్న అధికారులు సమాధానం ఇచ్చారు. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.

ఎంపీ మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలులో స్నేహ బ్లాక్‌లో వసతులు కేటాయించామని జైలు శాఖ అధికారి కోర్టుకు తెలిపారు. అక్కడ సరైన సదుపాయాలు లేవని మిథున్ రెడ్డి లాయర్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని జైలు శాఖ అధికారి బదులిచ్చారు. ఈరోజు సాయంత్రం లోపు తీర్పు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande