మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ, 22 జూలై (హి.స.) మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించనున్న అధునాతన పా
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి


తెలంగాణ, 22 జూలై (హి.స.) మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని

అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుగొండ, రామదూత టౌన్షిప్ కాలనీలో ముడా నిధులు రూ.25 లక్షలతో నిర్మించనున్న అధునాతన పార్క్ నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ను కార్పొరేషన్గా రూపాంతరం చేయడం జరిగిందని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం ఎంతో అవసరమన్నారు.

అందుకే నగరంలో అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మార్పు ఇప్పుడే మొదలైందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande