మ‌రో మైలు రాయిదాటిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం.. 200 కోట్ల ఉచిత ప్రయాణాలు
హైదరాబాద్, 22 జూలై (హి.స.) మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం మ‌రో మైలు రాయి దాటింద‌ని, ఈ ప‌థ‌కం ద్వారా రెండు వంద‌ల కోట్లు మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని, దీన్ని పుర‌స్క‌రించుకుని రేపు బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బ‌స్ స్టేష‌న్‌ల్లో
మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం


హైదరాబాద్, 22 జూలై (హి.స.)

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం మ‌రో మైలు రాయి దాటింద‌ని, ఈ ప‌థ‌కం ద్వారా రెండు వంద‌ల కోట్లు మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణం చేశార‌ని, దీన్ని పుర‌స్క‌రించుకుని రేపు బుధ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బ‌స్ స్టేష‌న్‌ల్లో సంబురాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలనలో అమలు చేసిన మొట్టమొదటి ప‌థ‌కం మహా లక్ష్మి పథకం అని, ఈ ప‌థ‌కం 9 డిసెంబర్ 2023 నుండి విజయవంతంగా అమలవుతుంద‌న్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశార‌ని, వీటి విలువ రూ. 6700 కోట్లు అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రీయింబ‌ర్స్‌మెంట్ కూడా ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తోంద‌న్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande