మహబూబాబాద్, 22 జూలై (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ అన్నారు. మంగళవారం బోడగుట్ట గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహద పడుతుందన్నారు.మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమ వుతుందని, అందుకే అందరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్