హైదరాబాద్, 22 జూలై (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ చేసిన మంచి పనులను సవివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు.
సచివాలయంలో నేడు వారు ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి జి. మల్సూర్‌తో కలిసి మంగళవారం జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో చేసినప్పటికీ ఆశించిన రీతిలో ప్రజలకు వివరించలేకపోతున్నామని అన్నారు. ఇచ్చిన హామీలనే గాక ఇతర అంశాలలో ప్రజోపయోగపనులు చేపట్టామని , 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే ఇంత భారీ నియామకాలు చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణను అగ్రపధంలో నిలిపామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్