ఓయూలో మద్యం పార్టీలు.. బయటి వ్యక్తుల ప్రవేశం ఆపాలని విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్, 22 జూలై (హి.స.) బయట వ్యక్తుల ప్రవేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా వాతావరణం దెబ్బతింటుందని, ఓయూను క్లోజ్డ్ క్యాంపస్ మార్చాలని వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వారు యూనివర్సిటీ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరస
ఉస్మానియా


హైదరాబాద్, 22 జూలై (హి.స.)

బయట వ్యక్తుల ప్రవేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా వాతావరణం దెబ్బతింటుందని, ఓయూను క్లోజ్డ్ క్యాంపస్ మార్చాలని వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వారు యూనివర్సిటీ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ వీసీ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు విశ్రమించేది లేదని పట్టుబట్టారు. ఓయూ పోలీసులు జోక్యం చేసుకొని వారిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ బయట వ్యక్తులతో యూనివర్సిటీ వాతావరణం దెబ్బతింటుందని, యూనివర్సిటీ మందు బాబులకు అడ్డాగా మారిందన్నారు.

పండగలు, పబ్బాలకే కాకుండా నార్మల్ రోజుల్లో కూడా బయట వ్యక్తులు వచ్చి క్యాంపస్లో దావతుల పేరుతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బయట వ్యక్తులు యూనివర్సిటీలో దావతులు జరుపుకొని మద్యం సేవించడమే కాకుండా ప్రశ్నించిన విద్యార్థుల పై దాడులు చేశారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న యూనివర్సిటీ అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అరెస్టు చేస్తున్న పోలీసులు.. బయటి వ్యక్తులు వచ్చి క్యాంపస్లో మందు కొడితే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande