హైదరాబాద్, 22 జూలై (హి.స.)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి
హరీష్ రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు. తెలంగాణలో 16,000 మందికి పైగా హోంగార్డులకు జీతాలు సకాలంలో చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. నెల మొదలై 22 రోజులు గడిచినా భద్రాది కొత్తగూడెం, మెదక్, మహబూబ్నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న హోంగార్డులకు జీతాలు అందలేదని అన్నారు.
దీంతో గత్యంతరం లేక ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్