కేసీఆర్‌కు పేరు వస్తుందనే కిట్లను ఇవ్వడం లేదు : కేటీఆర్
హైదరాబాద్, 22 జూలై (హి.స.) ఎక్కడ కెసిఆర్ కు ప్రజల్లో మంచి పేరు వస్తుందోనని రేవంత్ రెడ్డి సర్కార్ బాలింతలకు కిట్లను పంపిణీ చేయట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ నెల 24న తన జన్మదినం సందర్భంగా కేటీఆర్ 5 వేల మంది
Ktr


హైదరాబాద్, 22 జూలై (హి.స.)

ఎక్కడ కెసిఆర్ కు ప్రజల్లో మంచి పేరు వస్తుందోనని రేవంత్ రెడ్డి సర్కార్ బాలింతలకు కిట్లను పంపిణీ చేయట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ నెల 24న తన జన్మదినం సందర్భంగా కేటీఆర్ 5 వేల మంది తల్లులకు 'గిఫ్ట్ ఏ స్మైల్' కింద కేటీఆర్ కిట్లను పంపిణీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కొంతమంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కిట్లను ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని గుర్తు చేశారు. 2014కు ముందు నేను రాను బిడ్డ.. సర్కారు దవఖానకు అని జనాలు భయపడేవారని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande