హరిహర వీరమల్లు చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు
హైదరాబాద్, 22 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఇది చిత్ర యూనిట్‌కే కాదు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా శుభవ
తెలంగాణ అనుమతులు


హైదరాబాద్, 22 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఇది చిత్ర యూనిట్‌కే కాదు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా శుభవార్తగా మారింది. సాధారణంగా టికెట్ ధరల పెంపు అనేది ప్రత్యేక దృష్టిని ఆకర్షించే అంశం. ఈ సినిమాకు విడుదలకు ముందు నుంచే ఆ అవకాశం లభించడం విశేషం. ఈ నెల 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోల నిర్వహణ కోసం ఒక్కో టికెట్ ధరను రూ.600 వరకు నిర్ణయించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. దీనితో ప్రీమియర్ షోల కోసం భారీగా టికెట్ల డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు.ఇక సినిమా విడుదలైన ఈ నెల‌ 24 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు సాధారణ థియేటర్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు టికెట్ ధర పెంచుకోవచ్చని అధికారికంగా అనుమతి లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande