అమరావతి, 22 జూలై (హి.స.)
: ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి సహా 11 మందికి రిమాండ్‌ను పొడిగించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ