హైదరాబాద్, 22 జూలై (హి.స.)
తెలంగాణ టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. టెట్ ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి నేడు విడుదల చేశారు. మొత్తం లక్షా 37 వేల 429 మంది పరీక్ష రాయగా 33.98 శాతం మంది అర్హత సాధించారు. అభ్యర్థలు ఫలితాల కోసం https://tgtet.aptonline.in/tgtet/ResultFront వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.మొత్త 90,205 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 30,649 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా వెల్లడించారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,37,429 మంది పరీక్షలు రాశారు. గణితం, సైన్స్‌కు 48998 మంది హాజరుకాగా, 17574ల మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్ఎస్ కి 41207 కి 13075 మంది ఉత్తీర్ణులయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..