సూర్యాపేట.జిల్లా బంగారం దుకాణంలో.చోరీ రాష్ట్ర వ్యాప్తంగా. సంచలనం
అమరావతి, 22 జూలై (హి.స.) సూర్యాపేట నేరవిభాగం, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణంలో చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున మహాత్మాగాంధీ రోడ్డులోని దుకాణం వద్దకు చేరుకున్నారు. మొదట 18 కిలోల మేర బంగా
సూర్యాపేట.జిల్లా బంగారం దుకాణంలో.చోరీ రాష్ట్ర వ్యాప్తంగా. సంచలనం


అమరావతి, 22 జూలై (హి.స.)

సూర్యాపేట నేరవిభాగం, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణంలో చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున మహాత్మాగాంధీ రోడ్డులోని దుకాణం వద్దకు చేరుకున్నారు. మొదట 18 కిలోల మేర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత లాకర్‌ గదిలోనే ఆరున్నర కిలోల బంగారు ఆభరణాలను దొంగలు వదిలి వెళ్లినట్లు గుర్తించారు. లాకర్‌ గదిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మొత్తం 8 కిలోల బంగారం, రూ.18 లక్షలు చోరీకి గురైనట్లు దుకాణం యజమాని తెడ్ల కిశోర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande