అమరావతి, 22 జూలై (హి.స.), : గుంతకల్లు నుంచి కడప, తిరుపతి మీదుగా విశాఖకు వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించడానికి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుడు గమ్యానికి చేరుకోవడానికి ఒకే రైలులోనే రెండు టికెట్లు కొనాల్సి వస్తోంది. ఈక్రమంలో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ కడప నుంచి తిరుపతి, విశాఖ మీదుగా కొర్బా వెళ్లేది. తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం గత నెల 30 నుంచి గుంతకల్లు వరకు పొడిగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ