తిరుమలలో రోజు రోజుకు. పెరుగుతున్న భక్తుల రద్దీ వాకుంఠం.క్యూ కాంప్లెక్.3 నిర్మాణానికి నిపుణుల కమిటీ
తిరుమల, 22 జూలై (హి.స.) : ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణకు రూ.4.35 కోట్లు కేటాయిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఆగస్టు నుంచి అక్కడ మూడు పూటలా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో
తిరుమలలో రోజు రోజుకు. పెరుగుతున్న భక్తుల రద్దీ వాకుంఠం.క్యూ కాంప్లెక్.3 నిర్మాణానికి నిపుణుల కమిటీ


తిరుమల, 22 జూలై (హి.స.)

: ఒంటిమిట్ట రామాలయంలో పూర్తిస్థాయి అన్నప్రసాద వితరణకు రూ.4.35 కోట్లు కేటాయిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఆగస్టు నుంచి అక్కడ మూడు పూటలా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్‌ నాయుడు, తితిదే ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మించేందుకు.. దీనిపై సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్‌ తెలిపారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా పరిపాలనా భవనం నిర్మించాలని నిర్ణయించామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande