చిత్తూరు , 22 జూలై (హి.స.)
మన చుట్టూ జరిగే వింత సంఘటనలు చూస్తే.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమేనని అనుకుంటూ ఉంటాం. తాజాగా అలాంటి ఓ వింత ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఆవు దూడలకు ఓ శునకం పాలిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒకసారి, రెండుసార్లు కాదు.. క్రమం తప్పకుండా ప్రతిరోజూ దూడలకు పాలిస్తుండటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి